Thursday, 30 July 2026 02:14:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అభివృద్ధి అంటే అందంగా శిలాఫలకాలు తీర్చిదిద్దడం కాదు... -బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్

Date : 25 August 2023 04:26 AM Views : 403

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అభివృద్ధి అంటే అందంగా శిలాఫలకాలను తీర్చిదిద్ది ప్రారంభోత్సవాలు చేయడం కాదని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.కొత్తగూడెంలో ఇకనుంచి జరిగే అభివృద్ధి పనుల శంకుస్థాపనలన్నీ ఎన్నికల స్టంట్లేనని, ప్రజలను మభ్య పెట్టేందుకు వేస్తున్న నాటకాలనీ విమర్శించారు.నియోజకవర్గంలో ఇప్పటివరకు శంకుస్థాపనలు చేసిన పనులు ఎన్ని....? పూర్తి అయినవి ఎన్ని....? అనే విషయంపై బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్నానని సవాలు విసిరారు.గత ఎంతో కాలంగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు.ఇదంతా ఒకెత్తు అయితే పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఏళ్ల తరబడి బిల్లులు ఆపేసారని ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.పనులు చేయించుకోవడం బిల్లులను నిలిపివేయడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు.ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.పాల్వంచ బస్టాండ్ లో మరమ్మతుల కోసం జనవరి 5వ తేదీన 41లక్షల రూపాయల పనులకు మంత్రి పువ్వాడ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి 8నెలలు గడిచిన నేటికి పనులు ప్రారంభించలేదని,అభివృద్ధి పనులు అంటే అందమైన శిలాఫలకాలను తీర్చిదిద్దడం కాదని సూచించారు.ఈ విషయాన్ని ఇకనైనా గుర్తించాలని,లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో గర్వభంగం తప్పదని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా సంయుక్త కార్యదర్శి చెనిగారపు నిరంజన్ కుమార్,అల్లకోండ శరత్,సందేల సందీప్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: