సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం అగ్రహారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ప్రజలకు మాయమాటలు చెప్పి అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి? బర్రెను ఎక్కడ కట్టేయాలి? చుట్టం వస్తే ఎక్కడ పండాలని?అని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండుసార్లు అధికారంలోకి వచ్చినా కూడా ఈ హామీని నెరవేర్చలేదు, పేదల సొంతింటికల కలగనే మిగిలిపోయింది. కనీసం కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇల్లు నిర్మాణానికి 2,80,000 లు ఇస్తుంటే కనీసం ఆ సొమ్మును కూడా పేద ప్రజలకు అందించకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత పథకాలకు వాడుకుంటున్నాడు ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పటికే ఆ డబల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఆరు సంవత్సరాలు దాటిన పంచకపోవడం గమనార్హం.ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయాయి. డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నియోజక వర్గం లోని అర్హులైన వాళ్లందరికీ తక్షణమే పంపిణీ చేయాలని అలాగే రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అర్హులైన పేదలందరికీ ఇల్లు, ఉచితంగా వైద్యం, ఉచితంగా విద్య అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొనతం లచ్చి రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి, మండల అధ్యక్షుడు నర్సింగ్ అంజయ్య ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు మేకల వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు డెనుమకొండ రామరాజు, నాయకులు రామినేని క్రిష్ణయ్య, ముసుకుల చంద్రారెడ్డి, చిత్తలూరి సోమయ్య,కరెంగులా రాంకి,శోభన్ బాబు, మంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin