Sunday, 07 June 2026 09:11:59 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో...

Date : 23 November 2022 01:28 AM Views : 460

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా దాదాపు రూ.3,300/- కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాల ప్రసార కార్యక్రమoను స్థానిక జిల్లా కలెక్టరు వారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమారి నాగలక్ష్మి సెల్వరాజన్ , బెస్త కార్పోరేషన్ చైర్మన్ శ్రీ రమణ , ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా మత్స్య శాఖ అధికారులు మరియు లబ్దిదారులు పాల్గొన్నారు. రాప్తాడు మండలం గాండ్లపర్తి గ్రామ సచివాలయ పరిధిలోని జి.కొత్తపల్లి గ్రామంలో గౌరవ రాప్తాడు శాసనసభ సభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గడప గడప తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేసారు. ప్రజలందరూ YSR కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో చేసిన అభివృద్ధి మరియు అందించిన సంక్షేమ పథకాల ఫలాల గురించి, ప్రభుత్వ పరంగా వారికి కలిగిన లబ్ది గురించి సంతృప్తి తెలుపుతూ... హర్షం వ్యక్తం చేస్తూ, రాబోవు ఎన్నికలలో కూడా మళ్ళీ శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి , YSRCP పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని, ఇలాగే సoక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని వారి అభిలాషను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమoలో YSRCP మండల కన్వీనరు, స్థానిక MPP, Vice MPP, సర్పంచులు, MPTCలు, YSRCP ప్రజా ప్రతినిధులు, నాయకులు & కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు మరియు పెద్ద ఎత్తున ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :