Sunday, 13 September 2026 08:53:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీఆర్ఎస్ గూటికి షాద్ నగర్ బిజెపి సీనియర్ నేత పటోళ్ల వెంకటేశ్వర రెడ్డి

Date : 22 November 2023 10:59 AM Views : 321

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గంలో బిజెపికి పార్టీకీ బీఆర్ఎస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, షాద్ నగర్ సీనియర్ నాయకుడు పటోళ్ల వెంకటేశ్వర రెడ్డి బిజెపికి పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సమక్షంలో హైదరాబాద్ లో కాసేపటి క్రితం టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కేశంపేట ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ తదితరులతో కలిసి కేటీఆర్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, పటోళ్ల వెంకటేశ్వర్ రెడ్డికి గులాబీ కండువా వేసి పార్టీలోకి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. షాద్ నగర్ నియోజకవర్గంలో 1995లో రాజకీయ అరంగ్రేటం చేసిన వెంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా 13 సంవత్సరాలు కోందుర్గు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడుగా సుదీర్ఘకాలం సేవలు అందించారు. కొందూర్గు ఉమ్మడి మండలానికి జెడ్పిటిసిగా పోటీ చేసి అతి తక్కువగా 200 ఓట్ల మెజార్టీతో ఓటమిపాలయ్యారు. అంతేకాదు పిఎసిఎస్ చైర్మన్ గా కూడా ఆయన సేవలు అందించారు. జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ గా కూడా ఆయన పదవి పొందారు. 2018లో భారతీయ జనతా పార్టీలో డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రోత్సాహం మేరకు బిజెపిలో చేరారు. ఏపీ జితేందర్ రెడ్డికి నమ్మిన బంటుగా పనిచేశారు. పార్లమెంటు ఎన్నికల్లో డీకే అరుణకు మంచి ఓటు బ్యాంకు ను అందించారు. కిసాన్ మూర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉంటూ ఆయన బిజెపికి సేవలు అందించారు. అంజయ్య గెలుపు కృషి చేస్తా పటోళ్ల వెంకటేశ్వర రెడ్డి.... ప్రస్తుతం షాద్ నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీలో నాయకుల లోపాలతో పార్టీలో కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఎవరికి తగిన సముచిత స్థానం లభించడం లేదని అందుకే పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా బిజెపి పూర్తిగా డీలా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను పట్టించుకోని ఏ పార్టీ మనుగడ సాగించదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు అండగా నిలుస్తామని భరోసా ఇవ్వడం పార్టీ ఉన్నతికి ఎన్నికల్లో కార్యకర్తలకు ఇచ్చే సహకారానికి ఆయన సూచించిన మార్గదర్శకాలు పాటించి ఎమ్మెల్యే అంజయ్యను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తానని అన్నారు. టిఆర్ఎస్ గూటికి వచ్చిన పటోళ్ళ వెంకటేశ్వర రెడ్డిని ఎంపీపీ రవీందర్ యాదవ్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: