Tuesday, 15 September 2026 05:47:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బి ఆర్ యస్, కాంగ్రెస్ పార్టీ లు భూ కబ్జాల పార్టీలు... - అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పిల్లుట్ల రఘు

Date : 25 November 2023 08:47 AM Views : 330

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు మండలంలో పలు ప్రాంతలలో ఎఐఎఎఫ్ బి పార్టీ సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల ప్రచారాన్ని ఆశిషజానవాహిని తో రేవూరి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు సింహం గుర్తుకు వేసి రఘును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. జోరు వానలో కూడా ఆగని ప్రచారం తో,ఉత్తేజ నిండిన ఉత్సాహంతో సింహం గుర్తుపై ఎమ్మెల్యే గెలుపుని ఎవరు ఆపలేరని రేవురు ప్రజలు అన్నారు. ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ నియోజకవర్గ మండలాలు తనవైపే, మండలాల్లో పల్లెలన్ని తనవైపే ఉన్నాయని తన లాంటి ప్రజాసేవకుడే ఎమ్మెల్యేగా కావాలని నియోజకవర్గ మొత్తం కోరుకుంటుందని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిపోయిందని అన్నారు.రైతులను కరెంటు, సాగునీటి కష్టాలు లేకుండా చూసుకుంటానని, ఊరిలో ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపిస్తానని, అన్ని కులాల మతాల పండగలకు ఆర్థిక సాయం అందిస్తానని అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు దీటుగా మేనిఫెస్టో ఉంచానని విద్యా వైద్య ఆర్థికంగా, నిరుద్యోగులు కు కోచింగ్లు ఇప్పిస్తూ,ప్రతి గ్రామంలో ఉన్న పేదలకు సొంతంగా 10 ఇండ్లను నిర్మిస్తానని, పండగలను ప్రజలందరూ కలిసి చేసుకునేలా తన మార్కు ఉంటుందని,అన్నదానాలకు ఆర్థిక సాయం అందిస్తానని.. నూతన దేవాలయాలకు పాఠశాలలకు సాయం అందిస్తామన్నారు.. మొన్న వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాలలో ముగ్గురు యస్ఐ లు, 40 మంది కానిస్టేబుల్ గా ఎంపికైనరు అన్నారు. రాబోయేది రఘున్న రాజ్యమని ప్రజలే పాలకులు అని అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ఓట్లను దుర్వినియోగం చేసి, అవినీతికి అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, పేదవాళ్ల ఇళ్లను కూల్చి వారు మాత్రం ఇంద్రభవనం లాంటి ఇళ్లలో సకల సౌకర్యాలు పొందుతున్నారని అన్నారు. సీనియర్ నాయకుడు 800 ఎకరాలు కబ్జాలు చేశారని ఆరోపణలు ఉన్నాయని అన్నారు. మెళ్లచెరువు మండల ప్రాంతం సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉండడం వలన తాను ఎమ్మెల్యేగా గెలిచాక స్థానిక యువతకు ఫ్యాక్టరీలు ఉద్యోగాలపరంగా ప్రాధాన్యత ఇస్తానన్నారు. రైతులు పత్తి మిరపలకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తనదే అన్నాడు. అకాల వర్షం చేత ఎవరైనా రైతులు నష్టపోతే వెంటనే సహాయాలు అందిస్తామన్నారు. పెళ్లి కానుకలు, దశదిన కర్మలకు ఆర్థికచేయుతలు అందిస్తామన్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు నియోజవర్గ వ్యాప్తంగా నిర్వహించామన్నారు. తన ప్రజా ఆదరణను చూసి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు గుండెల్లో భయం పట్టుకుందని అన్నారు. తన గెలుపును తట్టుకోవడానికి పార్టీలు నాయకులను కొనుక్కునే ప్రయత్నాలు, పార్టీల కండువాలు కప్పే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్టీలన్నీ కుమ్మక్కైన సింగిల్ గా సింహం గుర్తుతో ఎమ్మెల్యే గెలుపును ఎవరు ఆపలేరు అన్నారు.ఏదేమైనా అందరి దేవుళ్ళ దీవెనలతో, ప్రజల ఆదరాభిమానాలతో తన ఎమ్మెల్యే గెలుపు ఖాయమని,ప్రజలు కూడా మంచి ఎదో చెడేదో ఆలోచించి మంచి వైపు నిలబడే నిర్ణయం తీసుకోని సింహం గుర్తుకే ఓటేసి తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని అన్నారు. తన గెలుపు ప్రజా గెలుపుగా హుజూర్నగర్ నియోజకవర్గం చరిత్ర సృష్టిస్తుందని పిల్లుట్ల రఘు అన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామస్తులు, ఎఐ ఎఫ్ బి పార్టీ సింహం గుర్తు కార్యకర్తలు,రఘున్న అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: