సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండల కేంద్రంలో ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించిన సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం సిపిఎం మండల కార్యదర్శి ఎస్ కే యాకూబ్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ డ్యాములో 528 అడుగుల నీరు ఉంది కనీసం వారాబంది ప్రకారంగా అయినా మంచినీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎడమ కాలువకు ఒకసారి నీరు విడుదల చేసినట్లయితే బోర్లు, బావుల కింద పెట్టిన నాట్లు నీళ్లు రావటం మూలాన బోర్లలో నీళ్లు కాస్త పైకి వచ్చి రైతాంగానికి ఉపయోగపడతాయని యాకుబ్ అన్నారు .489 అడుగులు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మోటర్లు ద్వారా నీరు తీసుకోవడం జరిగినది 528 అడుగులు నీరు ఉంటే అధికారులు కానివ్వండి ఈ జిల్లా మంత్రి కానివ్వండి సాగర్ నీటిపై స్పష్టమైన ప్రకటన చేయకుండా రైతాంగం వ్యవసాయ మీది ఆధార పడుతున్న ఈ జీవుల పరిస్థితి ఆలోచించరా మొత్తం ఎన్నికలపైనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు దృష్టి పెట్టి రైతుల సమస్యలు పట్టీ పట్టనట్టు చూస్తున్నారు. డ్యాముని సందర్శించి దాని యొక్క స్థితిగతులు వివరించి రైతాంగానికి ఒక స్పష్టమైన హామీ ఇచ్చినట్లయితే రైతులు సాగర్ నీటిపై ఆధారపడకుండా కనీసం ఆరుతడి పంటలైన వేసుకోవడానికి వీలు ఉంటుందా ఇలాంటి సలహాలు సూచనలు ఇవ్వకుండా మళ్లీ అధికారమే పరమావధిగా పనిచేస్తున్న ఈ పాలకులు సాగర్ ఎడమ కాలువ నీటిపై స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎస్ కే యాకూబ్ డిమాండ్ చేశారు .సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల సైదయ్య, రాయిని గూడెం సర్పంచి దోసపాటి భిక్షం, కుక్కునూరు అంజయ్య ,బండారు రాములు, నరసయ్య, బాలకృష్ణ , తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin