సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఉంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఆరు గ్యారెంటీలతో పాటూ కొన్ని కీలకమైన పథకాలను కాంగ్రెస్ నిన్న తన ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. బీజేపీ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విజయశాంతికి క్యాంపెయిన్ స్టార్‌గా కీలక బాధ్యతలు అప్పగించడం అందరిని షాక్‌కి గురిచేసింది. బీజేపీ తెలంగాణ ఎన్నికల ప్రచారకులుగా పక్కరాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణ ఆడబిడ్డ విజయశాంతి పేరు లేకపోవడం గమనార్హం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయశాంతికి ఎలాంటి గౌరవం ఇస్తుందో చెప్పేందుకు ఉదాహరణే ఈ కీలకమైన బాధ్యత అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈమెతో పాటూ కన్వీనర్ల జాబితాలో మల్లు రవి, కోదండ రెడ్డి, వేమ్ నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
-----------------------
Admin