Friday, 08 May 2026 10:33:58 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

పోలీస్ స్టేషన్ కు సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలి... -ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

Date : 21 February 2023 11:34 PM Views : 475

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరులోని సింగరేణి ఇల్లందు క్లబ్ నందు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎస్పీ ఈ రోజు అనగా 21-02-2023 జిల్లాలోని పోలీసు అధికారులందరితో ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ మణుగూరులోని సింగరేణికి చెందిన ఇల్లందు క్లబ్ నందు నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ,వారికి న్యాయం చేకూర్చే విధంగా భరోసా కల్పించాలని అన్నారు.బాధితుల సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి,విచారణ చేపట్టి అట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలియజేసారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక వ్యక్తులు రౌడీ షీటర్ల కదలికలను నిత్యం గమనిస్తూ, వారిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని తెలిపారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘవిద్రోహక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బ్లూకోల్ట్స్,పెట్రోలింగ్ వాహనాలను అన్ని ప్రాంతాల్లో తిరిగేలా చూడాలని కోరారు.నేర ఛేదన,నేరాలను అదుపు చేయడంలో భాగంగా ప్రతీ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.మహిళలు,విద్యార్థినులకు షీ టీమ్స్ ఆవశ్యకతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.గంజాయి,గట్క,బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.వర్టికల్స్ వారీగా అధికారులు,సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :