సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలో సిపిఐ కౌన్సిలర్లు మాట్లాడుతూ.... కొత్తగూడెం పట్టణంలోని ఏ గ్రేడ్ మున్సిపాలిటీలోని 36 వార్డులలోని ప్రజలు కిన్నెరసాన్ని నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిన్నెరసాని లో నీళ్లు నిండుగా ఉన్నా ప్రజలకు మాత్రం అందించడం లేదు. కానీ ప్రభుత్వం ఇంటింటికి నల్ల మిషన్ భగీరథ పేరుతో కోట్లు ఖర్చు చేసామని సురక్షిత మంచినీటిని అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. పైపులు వేశారు కానీ కనెక్షన్లు మరిచారు. కొత్తగూడెం ప్రజలకు సంవత్సరంలాకొద్ది నీటిని అందించిన పాపాన పోలేదని ప్రజలు వాపోతున్నారు. రిపేర్ లా పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ కొత్తగూడెం ప్రజలకు నీళ్లు అందించిన పాపాన పోలేదు. కానీ ఈరోజు మొక్కల పేరుతో ఆరు కోట్ల ప్రపోజల్ పెట్టారు. ఆ మొక్కలు ఎక్కడ ఉన్నాయో గాని నీళ్లు ఎక్కడ పోతున్నాయో గాని కొత్తగూడెం ప్రజలకు గొంతు తడపటం లేదు. ఎమ్మెల్యే కి చెప్తాం, మున్సిపల్ కమిషనర్ కి చెప్పాం, కలెక్టర్ కి చెప్పాం, కేటీఆర్ మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి కూడా విన్నవించుకున్నాము. అయినా కూడా కొత్తగూడెం ప్రజల నీళ్ల కష్టాలు తప్పడం లేదు వారి దాహం తీర్చడం లేదు వాళ్ళ గొంతు తడపడం లేదు. మా దాహాన్ని తీర్చండి మా గొంతును తడపండి మహాప్రభో అని కొత్తగూడెం ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. కిన్నెరసాని నీళ్లు ఫుల్లు కొత్తగూడెం నీళ్లు నిల్లు.... అని నినాదంతో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కొత్తగూడెం ప్రజలకు నీళ్లు అందించాలని సిపిఐ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.
-----------------------
Admin