సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : ప్రజాస్వామ్యాన్ని పరిహాసిస్తున్న బిజెపిని సాగనంపెందుకు దేశములోని యువత ముందుకు రావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు. ఆయన పాలకవీడు మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ సభ్యుల తో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు, ముందుకు రావాలని, ప్రజల సొమ్మును అంబానీ అదానీల పాలు చేస్తూ పెట్రోలు, డీజీల్ ,గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని, పౌర హక్కులను కాలరాస్తూ సిబిఐ, ఈడీలను, స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్న బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించాలని, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న దళిత బహుజన మైనారిటీ ఆదివాసి మైనారిటీ వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న మోడీ, అమిత్ షా,లను ఓడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.విద్యా వైద్యం ఉపాధి హక్కుల సాధనకై ఉద్యమించాలని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని గత శాసనసభ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఇస్తామన్నా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు చెల్లించాలని,1998,2004 సంవత్సరాలలో డీఎస్సీ లో క్వాలిఫై అయిన వారికి ఉద్యోగాలు కల్పించాలని కోరారు.ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు, శ్రీను, ,సాయి గౌడ్,, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin