సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి : మాజీ మంత్రి సంభాని మాట్లాడుతూ నా రాజకీయ అరంగేట్రం నుండి నా జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం నా రక్తం దారపోశానని, ఇంతకాలం నీతి నిజాయితీలతో పార్టీ బాగుకోసం, పార్టీ గెలుపు కోసం కృషి చేశానని, పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని గత 15సంవత్సరాల నుండి సత్తుపల్లి నియోజకవర్గంలో మండల, గ్రామ, బూత్, బీసీ, మైనార్టీ, ST, SC, మహిళా, యూత్, కిసాన్ సెల్ కమిటీలతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి 45000 వేల డిజిటల్ సభ్యత్వాలు చేసి గెలుపు ముంగిట నిలిపామని నేడు కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన వలస పక్షులకు టికెట్ ఇచ్చి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని, దీనిని అవమానకరంగా భావిస్తూ త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఇకపై తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని తెలిపారు. పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ టికెట్ విషయంలో వ్యవహరించిన తీరును నిరసిస్తూ పీసీసీ సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, స్టేట్ SC Dpt కన్వీనర్ కొండూరు కిరణ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాపా సుధాకర్, పెద్దబోయిన దుర్గా ప్రసాద్, చెలికాని రాజబాబు, కాసర చంద్రశేఖర్ రెడ్డి, శివా వేణు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్ రాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట రాజేష్, కొడంసింహం వంశీ, కిరణ్, వేణు, వర్కింగ్ ప్రెసిడెంట్లు కాలం కృష్ణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కనపర్తి కుమారి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, బూత్ కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, ఎన్రోలర్స్, పార్టీ అనుబంధ సంఘాలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ కి భాయ్ భాయ్ చెప్పారు.
-----------------------
Admin