సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మాజీ పార్లమెంటు సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అడుగులు జిల్లా వ్యాప్తంగా ఆసక్తిగా మారాయి. ఇటీవల గత కొంతకాలంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ భారీ సభ కార్యక్రమం తర్వాత అధికార పార్టీ నాయకులు కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం ఆత్మీయ సమ్మేళనా కార్యక్రమాలు నిర్వహిస్తూ బిఆర్ఎస్ పార్టీలో వారికి జరిగిన అన్యాయాన్ని గురించి వివరిస్తూ తమదైన శైలిలో విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటివరకు బాగానే ఉన్నా. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిజెపి, కాంగ్రెస్ పార్టీలోకి చేరతార లేక వైయస్ షర్మిల స్థాపించిన వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరతారా అనే విషయంపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ అడుగులు ఎటువైపు అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి...
-----------------------
Admin