సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందని జిల్లా చైర్ పర్సన్ సుందరి నాగయ్య , పొంచర్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు పిన్నని కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పోచర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం ప్రపంచంలోనే 220 దేశాలలో లయన్స్ క్లబ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే లయన్స్ క్లబ్ లక్ష్యమని అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిలో రోగులకు అక్టోబర్ 2న పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాసు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైన్స్ క్లబ్ లో సభ్యులుగా చేరి సామాజిక సేవా కార్యక్రమాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేదలకు సేవ చేయడంలో ఎంతో ఆనందం సంతోషం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కోలా నాగేశ్వరరావు, ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ కరుణ్ కుమార్ ,డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ నక్క రవికుమార్, మహిళా అధికార ప్రతినిధి పిన్నని ప్రభావతి, పానుగంటి నాగేందర్ రావు , కిత వెంకటేశ్వరరావు , కిత పద్మ, జోన్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి శ్రీరామ్ వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
-----------------------
Admin