సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ లోని కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి నియామకం పెద్దోళ్ల గంగారెడ్డి నీ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుల ద్యగ ఉదయ్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జిగా నియామకం చేసినందుకు పెద్దోళ్ల గంగారెడ్డి గారి గృహం నందు వారికి ఘనంగా శాలతో సన్మానించి మిఠాయిలు తినిపించడం జరిగింది. గంగారెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జిగా నియమకం చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అదేవిధంగా తనను సన్మానించిన ఆర్మూర్ పట్టణ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా బిజెపి అధికార ప్రతినిధి జె స్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ పెద్దోళ్ల గంగారెడ్డి బిజెపిలో చురుకుగా పనిచేసే బిజెపి పార్టీ అభివృద్ధికై కృషి చేయడం జరిగిందని గతంలో నిజాంబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్న తనను కరీంనగర్ పార్లమెంటు (ప్రభారి) ఇన్చార్జిగా నియామకం చేయడానికి హర్షిస్తూ రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఉన్నతమైన పదవులు భవిష్యత్తులో చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బిజెపి సీనియర్ నాయకులు బొట్ల విజయ్,నల్ల రాజారాం, మందుల వీరభద్రి, కుక్కునూర్ లింగన్న, బిజెపి జిల్లా కార్యదర్శి సభ్యులు కోల్కం వేణు, తూర్పు రాజు, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు ధోండి ప్రకాష్, మీసాల రాజేశ్వర్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు కర్ణం కృష్ణ గౌడ్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి మిర్యాల్ కర్ కిరణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin