Wednesday, 29 July 2026 10:21:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీలో 150 మంది చేరిక...

Date : 12 November 2023 01:53 AM Views : 282

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గంలో అన్యాయాలు, దౌర్జన్యాలు పెరిగాయని పాలకులు అవినీతికి పాల్పడుతూ, ప్రజలను దోచుకుంటూ నిర్మించిన అక్రమ సామ్రాజ్యాన్ని కూలగొట్టేందుకే మామిడిపల్లి వచ్చామని, మామిడిపల్లిలో ఒక కేఏ పాల్ ఉన్నాడని అతడు బాగా ఎగిరి పడుతున్నాడని మొన్నటి వరకు సోదరుడని వదిలేసామని ఇక అతనీ అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. శనివారం నందిగామ మండలం మామిడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు జంగా నరసింహా యాదవ్, సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్ యాదవ్ తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా 150 మందికి పైగా మాజీ సర్పంచ్ పెంటయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత వార్డు సభ్యులు గోపాల్ నరసింహ రవి ముదిరాజ్ మాజీ వార్డు మెంబర్లు ఈశ్వరయ్య పెంటయ్య శంకరయ్య మధుసూదన్ గౌడ్ శేఖర్ రెడ్డి సిద్దేశ్వర బుచ్చిరెడ్డి శ్రీపాల్ రెడ్డి తదితరులు పార్టీలో చేరగా వారికి ప్రతాప్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. అనంతరం మామిడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. మామిడిపల్లి అంటే ఎందుకో భయపడుతున్నారని, వీర్లపల్లి శంకర్ వస్తున్నాడు అంటే ప్రజలు ధైర్యంగా బయటకు వస్తున్నారని అది ఎందుకో అంటూ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి స్థానిక టిఆర్ఎస్ నాయకుడికి చురకలు అంటించారు. మామిడిపల్లిలో సమస్యలు తీష్ట వేశాయని అన్నారు. వ్యక్తుల అభివృద్ధి తప్ప గ్రామం అభివృద్ధి జరగలేదని అన్నారు. గ్రామంలో ఒక్కరికి కూడా ఒక డబల్ బెడ్ రూమ్ రాలేదని విమర్శించారు. ఎక్కడైనా ఒక్క ఓటుతో ఒక్కరే ఎమ్మెల్యే అవుతారని ఇక్కడ మాత్రం ఒక్క ఓటుతో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. మండలాలు పంచుకొని పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు పెరిగాయని వీటిని కట్టడి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని అన్నారు. స్థానిక నాయకుడు ఒకరు ఎగిరెగిరి పడుతున్నాడని ప్రజలకు ఎలాంటి భయం అక్కరలేదని ఇకపై ప్రజలకు తాను అండగా ఉంటానని తాను గెలిస్తే పేదలకు సంబంధించి లాక్కున్న భూములను తిరిగి ఇప్పిస్తానని అన్నారు. మామిడిపల్లిలో అందరూ చెప్పినట్టు కేఏ పాల్ ఎగిరెగిరి పడుతున్నాడని విమర్శలు చేశారు. అధికారం వచ్చాక దౌర్జన్యాలు అన్యాయాలు అక్రమాలపై విచారణ జరిపిస్తామని పేదలకు న్యాయం చేస్తామని ఈ గ్రామానికి స్వేచ్ఛ కల్పిస్తామని అన్నారు. మామిడిపల్లి గ్రామానికి ఒక కేఏ పాల్ తయారయ్యాడని అతను ఎగిరెగిరి పడుతున్నాడని ఇకపై అతనిని వదిలే ప్రసక్తే లేదని కొత్తూరు మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. గ్రామంలో కేఏ పాల్ తీరు చూస్తుంటే నవ్వొస్తుందని అన్నారు. పార్టీలో ఒకరిద్దరిని చేర్చుకొని గ్రామం మొత్తం ఖాళీ అయిందని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎగిరెగిరి పడుతున్న కెఏ పాల్ ఒకప్పుడు తమ సోదరుడిగా భావించినందుకు ఏమనలేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని హెచ్చరించారు. పదిహేను వేల మీ అక్కకి తెస్తా గ్రామంలో 3000 మెజార్టీ తెస్తా అని ప్రజల బాలు పలుకుతున్న కేఏ పాల్ మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నాడు అంటూ వీరుచుకుపడ్డారు. పేదలకు రైతులకు చేసిన అన్యాయాలపై తప్పకుండా ప్రశ్నిస్తామని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మామిడిపల్లిలో ఇంతకుముందు ఒక లెక్క ఇప్పటినుండి మరో లెక్క గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామంలో సభ జరుగుతున్నంత సేపు మంచి స్పందన లభించింది నాయకుల ప్రసంగాలకు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. మామిడిపళ్లి సభ విజయవంతం కావడంతో స్థానికులు కాంగ్రెస్ పార్టీని బలపరుచుతున్నారని గ్రామం ఖాళీ అయిందన్న తప్పుడు ప్రచారాన్ని తమ సభ నిరూపించిందని అభ్యర్థి శంకర్ అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :