సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ ప్రజలు నమ్మి కెసిఆర్ కు తెలంగాణ సీఎంగా అవకాశం ఇస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అబద్ధాలు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ తొమ్మిది ఏళ్లుగా నిరంకుశ అవినీతి కుటుంబ పాలన సాగిస్తున్నారని బిజెపి ములుగు జిల్లా ఇన్చార్జ్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఈరోజు బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక కార్మిక పరిశ్రమ (ITC గెట్ ) వద్ద శక్తి కేంద్రం ఇంచార్జ్ బిజం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్నర్ మీటింగ్ కు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల ఆయు ఆరోగ్యాలు బాగుండాలని ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించడం జరిగింది అలాగే, ఐదు లక్షల వరకు ఉచితంగా దేశంలో ఎక్కడైనా వైద్యం, చేయించుకునేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని. మరియు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరి ప్రయోజనం కొరకు, ఈ శ్రామ్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, ప్రజలందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు మరియు ఈ శ్రమ్ కార్డులు తీసుకోవాలని, అవగాహన కల్పించే విధంగా కరపత్రాలను పంచారు. అందుకు బిజెపి నాయకులు కార్యకర్తలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బీరక సాయి శ్రీను, కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సీతారాం నాయక్ సీనియర్ నాయకుడు గుగులోతు బాలు నాయక్ మొరంపల్లి బంజర సర్పంచ్ భూక్య దివ్యశ్రీ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు భూక్య వెంకటేశ్వర్లు బి ఎం ఎస్ నాయకులు వై వెంకటేశ్వరరావు బిజ్జం అశోక్ రెడ్డి ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ఓబీసీ మండల కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పాలం రవీందర్ రెడ్డి అధ్యక్షుడు వెలిశెట్టి రామారావు అసెంబ్లీ ఆర్గనైజర్ సెక్రెటరీ కొండిప్రభాకర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin