Monday, 14 September 2026 09:13:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలి ... - ఏఐటీయూసీ, సిఐటియు

Date : 14 September 2023 07:34 AM Views : 500

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడి, ఆయాల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు అక్కి నరసింహారావు సిఐటియు జిల్లా నాయకులు గద్దల శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలో వారు పాల్గొని మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా అంగన్వాడీలకు కనీస వేతనం 26వేల రూపాయలు చెల్లించాలని, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మినీ అంగన్వాడి టీచర్లను అంగన్వాడీ టీచర్లుగా గుర్తించాలని, ప్రభుత్వం పి ఎఫ్ ఈఎస్ఐ క,ల్పించాలని ఉద్యోగంలో వీరికి ఏమైనా జరిగితే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు 10 లక్షలు, ఆయాలకు 5 లక్షల రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ విరమణ పొందితే టీచర్లకు 10 లక్షలు ,ఆయాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, వీరు రిటైర్ అయితే ఉద్యోగంలో సగం పెన్షన్ రూపంలో చెల్లించాలని కోరుతూ గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా నేడు మూడవరోజు మణుగూరు లో ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ కార్యాలయం ముందు సుమారు మూడు గంటలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వీరి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్లు ,మినీ అంగన్వాడీ టీచర్లు ,ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. __సిపిఐ సిపిఎం నాయకులు మద్దతు. ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆందోళనకు సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మున్నా లక్ష్మీకుమారి ,సిపిఐ పట్టణ కార్యదర్శి దుర్గలసుధాకర్, సిపిఎం మండల కార్యదర్శి గోడి షాల రాములు , CPI జిల్లా సమితి సభ్యులు ఎస్కే సర్వర్, పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :