సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని బూరు గడ్డ గ్రామానికీ చెందిన పలువురు అభ్యర్థులు మొన్న ప్రకటించిన పోలీస్ నియామక ఫలితాలలో అత్యధికంగా 11 మంది అభ్యర్థులు నియమితులు కావడం పట్ల నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా బూరుగడ్డ యువకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బురు గడ్డ గ్రామానికీ చెందిన బీఎస్పి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.దేశగాని సాంబశివగౌడ్ వారిని కలిసి అభినందనలు తెలిపి, స్వీట్లు తినిపించి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వారి తండ్రి దేశ గాని గురువయ్య జ్ఞాపకార్థం గా పోలీస్ దేహ దారుఢ్య కోసం పిట్ నెస్ పరికరాలు అందించి,వారి నియామకానికి దోహద పడినందుకు అభర్ధులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజక వర్గ ఇంఛార్జి బోల్లగాని సుబ్బు గౌడ్,గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యరగాని కిరణ్ గౌడ్ మరియు బూరుగడ్డ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin