సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం లో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన గోవిందపురం 8వ. వార్డు చుట్టగుల్లా సల్లారావు కుటుంబానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు ఎర్రగాని నాగన్న ,సాముల శివారెడ్డి, తన్నీరు మల్లికార్జున్, మేళ్లచెరువు ముక్కంటి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin