Wednesday, 29 July 2026 12:33:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఫిర్యాదులు పెండింగ్ లేకుండా తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలి...

Date : 22 August 2023 08:29 AM Views : 368

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రజా పిర్యాదులు, ప్రజా ప్రతినిధులు సిఫారసు లేఖలు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా పిర్యాదులు, ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని శాఖల అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిటిషన్లు పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెండింగ్ పిర్యాదులు రానున్న 15 రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తదుపరి పెండింగ్ ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిర్యాదులు పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు యాక్షన్ టేకెన్ రిపోర్టు నివేదికలు అందచేయాలని చెప్పారు. మీ స్థాయిలో పరిష్కారానికి అవకాశం లేని అంశాలపై పిర్యాదుదారులకు లిఖితపూర్వకంగా తెలియచేయాలని చెప్పారు. పిర్యాదులు పెండింగ్ ఉంచడం వల్ల ప్రజలు పలుమార్లు అవే అంశాలపై ప్రజావాణిలోను, అలాగే తనకు ప్రత్యేకంగా పిర్యాదులు ఇస్తున్నారని పరిష్కారానికి అవకాశం ఉంటే పరిష్కరించాలి. అవకాశం లేకపోతే అదే అంశాలను క్రోడీకరిస్తూ పిర్యాదుదారునికి లిఖితపూర్వకంగా తెలియచేయాలని పేర్కొన్నారు. పెండింగ్ ఉంచడం వల్ల ప్రజల పలుమార్లు కార్యాలయాలకు రావడం జరుగుతుందని పెండింగ్ లేకుండా తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజా పిర్యాదులు, ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల పరిష్కారానికి చేపట్టిన చర్యలపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తానని అధికారులు సమగ్ర నివేదికలతో హాజరు కావాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదనారాజు, డిఆర్డీఓ రవీంధ్రనాద్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :