సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నాగార్జునసాగర్ నియోజకవర్గం..... నిడమనూరు మండల కేంద్రంలో.... నూతనంగా నిర్మించబోయే నూతన కోర్టు భవన నిర్మాణ పనులను సకాలంలో నిర్మించాలని..... నల్లగొండ జిల్లా శాసన మండలి సభ్యులు,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యం.సి కోటిరెడ్డి .అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు తో కలిసి కోర్టు భవన నిర్మాణ పనులను పర్యవేక్షించి,అధికారులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. మండలానికి విచ్చేసిన న్యాయమూర్తి గారిని బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో...... ఇన్చార్జి జూనియర్ సివిల్ జడ్జ్ సుమ బాల,బార్ అసోసియేషన్ న్యాయవాదులు మువ్వ అరుణ్ కుమార్,బొల్లం శ్రీనివాస్ యాదవ్,పుల్లారెడ్డి,వలసాని నాగరాజు,మాయకోటీ వినోద్, పొదిల శ్రీనివాస్,మేఘారెడ్డి, గోదాల వెంకట్ రెడ్డి,మట్టయ్య,జయమ్మ,స్వర్ణలత,లలిత, కోటేశ్వర్ రెడ్డి,బి. యస్.యన్ రాజు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin