Wednesday, 16 September 2026 01:03:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భయానికి బై పలకండి జయానికి జై చెప్పండి... - ఇంపాక్ట్ ట్రైనర్ మరియు మోటివేషనల్ స్పీకర్ ఆశీ కుమార్

Date : 06 February 2024 01:16 PM Views : 298

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం లోని గ్రీన్ వుడ్ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ ప్రోగ్రాంలో భాగంగా ఆయన మాట్లాడుతూ చాలా భయాలు మన ఊహించుకుంటే వచ్చేవే వాటి నుంచి ఎలా బయటపడాలి ముఖ్యంగా పరీక్షల ద్వారా కలిగే భయాన్ని ఆందోళనను ఎలా దూరం చేసుకోవాలి రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ మెరుగు పరచుకుంటూ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి పరీక్షల సమయంలో పరీక్షా హాల్ లో మరియు పరీక్ష అయిపోయాక వుండే మానసిక సంఘర్షణను ఎలా అదుపు చేసుకోవాలి సమయం విలువ తెలుసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరీక్షల్లో మరియు జీవితంలో ఎలా విజయం సాధించాలో చక్కగా వివరించారు. అలాగే జీవితంలో వచ్చే సమస్యలకు కృంగి పోకుండా మనలోని నెగిటివ్ థింకింగ్ ని పాజిటివ్ థింకింగా మార్చుకోవాలని ఒంటరి సమయాల్లో మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలని జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకుని విజయశిఖరాల్ని ఎలా చేరుకోవాలి మనలో ప్రశ్నలు మొలకెత్తితే వాటి సమాధానాలు వెతుక్కోవడం ద్వారా మనలో జ్ఞానాన్ని పెంచుకోవాలని వివరించారు తల్లిదండ్రులను గురువులను గౌరవించడం వారి పట్ల వినయంగా ఉండాలని ఇప్పుడు మనం గౌరవంగా, వినయంగా వుంటే మన భవిష్యత్ జీవితం గొప్పగా వుంటుందని మనం చూసే దృష్టిని మార్చుకుని కొన్ని చిన్న చిన్న మార్పులను మనలో చేర్చుకుని, కొన్ని లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగితే మనం అవలీలగా విజయ తీరాలను చేరుకోవచ్చు జయానికి జై జై చెప్పవచ్చు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ వుడ్ స్కూల్ కరస్పాండెంట్ మర్రెడ్డి, ప్రిన్సిపాల్ రాజిరెడ్డి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :