సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భారీ వర్ష సూచన దృష్ట్యా అన్ని యాజమాన్యాల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యా సంస్థలకు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల బుధవారం సెలవు ప్రకటించారు. హాస్టల్ విద్యార్థులు బయటకు రాకూడదని, హాస్టళ్లలోనే వుండాలని తెలిపారు. సహాయానికి జిల్లా కంట్రోల్ రూం 08744241950 కు ఫోన్ చేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటికి రావొద్దని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.
-----------------------
Admin