Monday, 14 September 2026 05:11:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఏపీ సీఎం జగన్ పై దాడి చేయడం సిగ్గుచేటు...

Date : 15 April 2024 07:36 AM Views : 276

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై దాడి చేయడం సిగ్గుచేటని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు ప్రముఖ న్యాయవాది హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామ్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అనుచరులు దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక మూకల తో దాడి చేయించారని ఆరోపించారు. టిడిపి నేతలు ఎన్ని కుయుక్తులు పన్నిన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. చేతగాని దద్దమ్మలు టిడిపి నాయకులు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక టిడిపి కార్యకర్తల చేత దాడి చేయించి గాయపరుస్తున్నారని విమర్శించారు. ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అగ్రస్థానంలో నిలిపినాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు. ఏపీలోని ప్రతి కుటుంబానికి జగన్ మోహన్ రెడ్డి అండగా ఉన్నాడని అన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. మళ్లీ జగన్ అధికారంలోకి రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. జగన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి చంద్రబాబు హత్య రాజకీయాలను తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :