సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం : ఏం సి కాలనీలో గోదావరి ముంపు ప్రాంతాల అప్రమత్తత విషయం పై ఏర్పాటు చేసిన మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షులు అల్లాడి పౌల్రాజ్ పాల్గొని మాట్లాడుతూ.... పోయిన సంవత్సరం గోదావరి వరదల వల్ల భద్రాచలంలోని సుభాష్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ,చప్టా దిగువ,ముదిరాజ్ బజార్, అయ్యప్ప కాలనీ,రెవెన్యూ కాలనీ, అశోక్ నగర్ కొత్త కాలనీ లోని ప్రజలు వరద బీభత్సానికి సర్వం కోల్పోయి రోడ్డున పడవలసి వచ్చింది. ఆ నష్టం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టైంలో మళ్లీ వర్షాకాలం సమిపించింది, ఇప్పటికీ కూడా స్లూయిస్ మరమ్మత్తులు కానీ, కరకట్ట మరమ్మత్తులు కూడా జరిపించలేదు,వరదల టైంలో ఏర్పాటు చేయవలసిన అధునాతన మోటార్లను గాని సిద్ధం చేయకపోవడంతో...... మొన్నటి గోదావరి వరద బీభత్సాన్ని చూసిన లోతట్టు ప్రాంత ప్రజలు మరలా గోదావరి వరదలు వస్తే అపార నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ముందస్తు చర్యగా కరకట్టా మరియు స్లూయిస్ మరమ్మత్తులు చేయించాలని, వరద వస్తే అవసరమైయే అన్నింటినీ సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఈ ప్రకటన ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో గుంటక రాజు కుషిని శ్యామ్ దాసరి నాగమణి,ఎన్నా పద్మ, పెద్దపాటి అరుణ్,పెద్ద పాటీ టింకు,అందే దుర్గ,అల్లాడి జస్వంత్,అల్లాడి అమ్ములు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin