Wednesday, 29 July 2026 05:01:14 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

త్రాగు నీటి ఎద్దడికి ప్రభుత్వం చర్యలు... - జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు

Date : 04 April 2024 09:11 AM Views : 301

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలేరు జలాశయం నింపడానికి ఎన్నెస్పీ నీటి విడుదల... త్రాగునీటి వినియోగం కొరకు మాత్రమే వినియోగించుకోవాలని విజ్ఞప్తి... త్రాగునీటి ఎద్దడి నివారణ కొరకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు. బుధవారం పెన్ పహాడ్ మండలంలోని ఎన్ అన్నారం బ్రిడ్జి వద్ద ఎన్నెస్పీ కెనాల్ ను అదనపు ఎస్పీ మేకల నాగేశ్వరరావు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్రాగునీటి ఎద్దడి నివారణ కొరకు నాగార్జున సాగర్ జలాశయం నుండి పాలేరు జలాశయం నింపడానికి మంగళవారం నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. త్రాగు నీటి కొరకు కాకుండా ఇతర అవసరాల వినియోగం చేయకుండా 26 టీం లను ఏర్పాటు చేసి 126మంది సిబ్బందిని 24గంటలు పర్యవేక్షించేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం త్రాగునీటి కొరకు మాత్రమే నీటిని విడుదల చేసిందని రైతులు బోర్లా ద్వారా నీటిని వినియోగించవద్దని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. పెన్ పహాడ్ పరిసర ప్రాంతాలలో బోర్లా వినియోగం చేయకుండా బోర్లకు కరెంట్ కనెక్షన్స్ తొలగించడం జరిగిందని బుధవారం సాయంత్రం యధావిధిగా కరెంట్ కనెక్షన్స్ తిరిగి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నెస్పీ నీరు పాలేరు జలాశయం చేరితే సూర్యాపేట జిల్లాలో మరో మూడు నెలల పాటు 393 అవాసలు, 192 గ్రామ పంచాయతీ లకు, రెండు మున్సిపాలిటీ లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా త్రాగు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :