సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రామవరం : పట్టణ పరిధిలో ఇళ్ళ స్థలాల పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి నాగయ్య గడ్డలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ లో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని,స్థానిక కౌన్సిలర్లు ఒక్కొక్కరి వద్ద రూ.30 నుండి రూ.50 వేల వరకు వసూలు చేసి సొంత ఇల్లు ఉన్నవారికి,మున్సిపల్ పరిధిలో కాకుండా పక్క మండలంలో,పక్క జిల్లాలో ఉంటున్న వారికి,ఒక వార్డులో ఉంటున్న వారికి ఇంకో వార్డులో మంజూరు అయ్యేలా చేశారని ఆరోపించారు.ఇంటి పట్టాల కోసం జరగాల్సిన ఎంపిక ప్రక్రియ అలా కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు సూచించిన వారినే అర్హుల జాబితాలో ప్రకటించారని ఆరోపించారు.అధికారులు విచారణ జరిపి ఇళ్ళు లేని పేదలకు,ఎన్నో ఏళ్ళుగా కిరాయి ఇళ్ళలో నివాసం ఉండే నిరుపేదలకు న్యాయం చేయాలని,ఇంటి స్థలాల కోసం డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా సహాయ కార్యదర్శి చెనిగారపు నిరంజన్ కుమార్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,చుంచుపల్లి మండల అధ్యక్షుడు నాని,పట్టణ ప్రధాన కార్యదర్శి సిద్దంకి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin