సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న భారత రాష్ట్ర సమితి పార్టీలోకి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన వారు స్వచ్ఛందంగా రావడం ఆనందంగా ఉందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. మంగళ వారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జిల్లేడు చౌదరి గూడెం మండలం వీరన్నపేట్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలువురికీ బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీగా వివిధ పార్టీల నుండి స్వచ్చందంగా పార్టీలో చేరినట్టు వారు వివరించారు. పార్టీలో చేరిన వారీలో.. మాజీ సైనిక ఉద్యోగి మహబూబ్ అలీ, ఖాజాపాషా, చాకలి శ్రీనివాస్, కుమ్మరి నారాయణ, గుర్రం నవీన్, అమ్మపూర్ రఫిక్, మొహిన్, రహీం, మహమ్మద్ ఖాజాపాషా, జాకారం నరేష్, బూరుగుపల్లి నరేష్, తోకలి సత్తయ్య, గడ్డం నర్సింలు, నరేష్, సురేష్, కావలి శ్రీనివాస్, కుమ్మరి యాదయ్య, గిరిముని శ్రీరామ్, రామాంజనేయులు, గడ్డ నర్సింహులు, సోహెల్ అమ్మపూర్ అస్లాం, జోగు మొగలయ్య, గడ్డం యాదయ్య, పుట్టపాటి వెంకటేష్, ఎరుకలి నవీన్, గడ్డం రమేష్, దివిటి కృష్ణ తదితరులు పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ హఫీస్, జెడ్పిటిసి బంగారు రాములు తదితరుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వీరన్నపేట్ మాజీ సర్పంచ్, మాజీ పట్వారీ పిట్టల చెన్నయ్య, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు జిల్లేడు వెంకటేష్, షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి సలీం, గ్రామ పార్టీ అధ్యక్షుడు జహంగీర్, మండల బీసీ సెల్ కార్యదర్శి మంగలి మంత్రి నర్సింలు, 3వ, 8వ వార్డ్ మెంబెర్స్, మంగలి నర్సింలు, కావలి నర్సింలు, గ్రామ మైనార్టీ యూత్ అధ్యక్షుడు ఆమీర్, మిద్దె అంజయ్య, జుట్టు వెంకట్ రాములు, జుట్టు సత్యయ్య, అబ్దుల్ ఖాదర్, ఆనంద్ గౌడ్, కుమ్మరి యాదయ్య, ఉస్మాన్, చాకలి యాదయ్య, గుండ్ల కాడి శ్రీను, రఫీక్, ఖాజాపాషా, పార్టీ, మండల, గ్రామ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
-----------------------
Admin