సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల కేంద్రానికి సమీపంలో ఎం. కొత్తపల్లి బండపై వెలసిన శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట పోస్టర్లను శుక్రవారం రెవిన్యూ కార్యాలయం ఆవరణలో తహశీల్డర్ కునుకుంట్ల శ్రీధర్ చేతుల మీదుగా విడుదల చేసారని ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.మే 5వ తేదీ శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయ స్థాపన 11వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి స్వాతి నక్షత్రం శుభ ఘడియల్లో వీణా వినాయకస్వామి, సుబ్రహ్మణ్యంస్వామి, అయ్యప్పస్వామి వారి విగ్రహాలను ప్రతిష్టించునున్నట్లు తెలిపారు.విగ్రహాలు అందించిన దాతలు తహశీల్డర్ కునుకుంట్ల శ్రీధర్,ఏఎస్ఐ కిషోర్ రెడ్డి,టైలర్ రాము సమక్షంలో హోమం, కలశ పూజలు నిర్వహించి విగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించి,అన్నప్రసాదాలు అందిస్తారని పేర్కొంటూ భక్తులు, గ్రామీణ ప్రాంత అయ్యప్పస్వామి భక్తులు పాల్గొనాలని అయన ఈసందర్బంగా కోరారు. ఈకార్యక్రమంలో రెవిన్యూ అధికార సిబ్బంది పాల్గొన్నారు....
-----------------------
Admin