Thursday, 30 July 2026 04:27:00 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మఠంపల్లి మండల కేంద్రంలో రేవంత్ కు వ్యతిరేకంగా మిన్నంటిన నిరసనలు...

Date : 13 July 2023 07:25 AM Views : 471

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న అమెరికా తానా సభల్లో తెలంగాణ రైతుల ఉద్దేశించి మూడెకరాల రైతుకు మూడు గంటల విద్యుత్ చాలంటూ, ఉచిత విద్యుత్తు అవసరమే లేనట్లు మాట్లాడి రైతుపై తమ పార్టీ వైఖరిని తెలియజేసినందుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు మఠంపల్లి మండల కేంద్రంలొ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య బి ఎస్ పి శ్రేణులతో కలిసి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరుగు పిచయ్య, సీనియర్ నాయకులు మన్నెం శ్రీనివాస్ రెడ్డి , ఎంపీపీ మూడవత్ పార్వతీ కొండ నాయక్ , జెడ్పీటీసీ బానొత్ జగన్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు రద్దు చేయాలనీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విచక్షణ లేనివని,తెలంగాణ రైతాంగంపై కాంగ్రెస్ కక్ష కట్టిందని,70 ఏళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని, కానీ దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదగాలని 24 గంటల ఉచిత కరెంటు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉండేది.ఇప్పుడు స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రైతులకు భరోసగా రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ భారత దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం మొదటినుంచి కాంగ్రెస్ కు రైతులంటే చిన్న చూపే, మొన్న ధరణి వద్దన్నారు ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని అంటున్నారు.రేవంత్ రెడ్డి ఒక బ్లాక్మెయిలర్,ఒక చీటర్ 5 నిమిషాలలో భూమి రిజిస్ట్రేషన్ అవుతున్న ధరణి పోర్టల్ని కూడా వద్దంటున్నారు.రైతులతో పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వమే గద్దె దిగే పరిస్థితి వచ్చింది. దేశానికి వెన్నుముకైనా రైతును రాజు చేయాలని సీఎం కేసీఆర్ రైతుల కోసం మరే రాష్ట్రంలోనూ లేని విధంగా రైతుల సంక్షేమం కోసం 30 వరకు రకరకాల పథకాలను అమలు చేస్తున్నారు. మల్లొకసారి రాబందు మూడు గంటల మాట ఎత్తితే.. రైతుల చేతుల్లో మాడు పగలడం ఖాయం.తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం, తెలంగాణ రైతులంతా ఇదంతా దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో మూడు గంటల అన్న కాంగ్రెస్ పార్టీని మాడు -మాడు చేసి చిత్తుచిత్తుగా ఓడగొట్టి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కోరారు . ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పిఎసిఎస్ డైరెక్టర్లు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, వివిధ అనుబంధ కమిటీ అధ్యక్షులు, రైతు సంఘాల నాయకులు, ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: