Wednesday, 16 September 2026 06:30:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గుండెబోయినగూడెం కు బస్సు సౌకర్యం కల్పించాలి...

Date : 15 December 2023 03:43 AM Views : 410

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : మిర్యాలగూడ ఆర్టీసీ డిపో వారు మిర్యాలగూడ నుండి గుండెబోయిన గూడెం వరకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీ పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. పాలకవీడు మండల కేంద్రం అయినప్పటికీ మండలంలోని గ్రామాల ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం నేరేడుచర్ల మిర్యాలగూడ వెళ్తుంటారని వారికి బస్సు సౌకర్యలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యాలను రద్దు చేసిందని, గత 20 సంవత్సరాల క్రితం పోలిస్తే అప్పుడే బస్సు సౌకర్యాలు బాగా ఉన్నాయని పాలకీడు మండలంలోని గుండెబోయిన గూడెం జాన్పాడు దర్గా వరకు సూర్యాపేట డిపో మిర్యాలగూడ డిపో వారు బస్సులు నడిపారని ఇప్పుడు ఎత్తివేసారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కొత్తగా అధికారంలోకీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించటం హర్షనియమని దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు.గ్రామీణ ప్రాంత మహిళలు ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగపడాలంటే మిర్యాలగూడ నుండి గుండెబోయిన గూడెం మూడు ట్రిప్పులు బస్సు నడపాలని అదే విధంగా జాన్పాడు దర్గాకు బస్సులు నడపాలని సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే పాలకీడు మండల వాసులకి ఇబ్బందిగా ఉందని సూర్యాపేట డిపో నుండి కూడా జాన్పాడు దర్గాకు బస్సులు నడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు గ్రామీణ ప్రాంత ప్రజలు మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకోవడానికి బస్సు సౌకర్యం కల్పిస్తే మంచిగా ఉంటుందని ఆయన అన్నారు.ఇదే క్రమంలో మహాలక్ష్మి పథకం అమలు ద్వారా ఆటో కార్మికులు నష్టపోతున్నందున వారికి కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపాధి అవకాశాలు చూపించాలని ఆయన కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: