సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులే బాగుపడతారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే సకలజనులు బాగుపడతారని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి , నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం రోజున కాంగ్రెస్ పార్ట ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొందుర్గ్ మండలం ఆగిర్యాల, గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుంధర్ రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టులో పొందుపరిచిన 6 పథకాల గురించీ ఇంటింటికి తిరుగుతూ తెలియజేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్ 500 రూ"లకు అంద జేస్తామన్నారు.ప్రతి ఇంటికి గృహాజ్యోతి కింద 200 యూనిట్లు ఉచితంగా కరెంట్. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు.రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కౌలు రైతులకు 15000 రూ"లు, వ్యవసాయ కూలీలకు 12000 రూ"లు. యూవ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల రూ"లు విద్యా భరోసా కార్డు ఇస్తుందన్నారు, అంతే కాకుండా చేయూత కింద 4000 నెలవారీ పింఛన్ 10 లక్షల రూ"ల ఆరోగ్యశ్రీ భీమాను అంద జేస్తుందన్నారు. ప్రజలకు చేరువయ్యే విదంగా కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టులో పథకాలను చేకూర్చిందని, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి బాల్ రెడ్డి, తులసి రామ్ నాయక్, ఖాదర్ ఘోరీ, వజ్రమ్మ, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు తదిరులు పాల్గొన్నారు.
-----------------------
Admin