Wednesday, 29 July 2026 01:26:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు ... మరియు భూ రక్ష పథకం ఏప్రిల్ 15 నాటికి పూర్తిచేయాలి

Date : 24 February 2023 01:16 AM Views : 559

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించిన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్. *వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జిల్లాలో రీసర్వే చేపట్టిన గ్రామాల్లో ఏప్రిల్ 15 నాటికి గ్రౌండ్ టు థింగ్ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందని సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించిన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ వివరించారు. *గురువారం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం, రీసర్వే, మ్యుటేషన్స్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ టిఎస్. చేతన్, డిఆర్ఓ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు. *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జిల్లాలో మొదట విడత కింద 26 గ్రామాల్లో, రెండవ విడత కింద 29 గ్రామాల్లో రీసర్వే చేపట్టడం జరిగిందని, ఆయా గ్రామాల్లో ఏప్రిల్ 15 నాటికి గ్రౌండ్ టు థింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను అధిగమించి రీ సర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేలా చూస్తామన్నారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి రీ సర్వే చేపట్టిన గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్ చేపట్టేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ రీసర్వే చేపట్టిన గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నిర్దేశించిన గడువులోగా గ్రౌండ్ టు థింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రౌండ్ టు థింగ్ తరువాత వెట్రైజేషన్, విలేజ్ సర్వేయర్, విఆర్ఓ లాగిన్ లో డేటా ఎంట్రీ సకాలంలో చేయాలన్నారు. స్టోన్స్ ప్లాంటేషన్ కూడా పూర్తి చేసేలా చూడాలన్నారు. త్వరితగతిన రీ సర్వేలో అన్ని రకాల ప్రక్రియలను పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఐఓఎస్ లు కృపాకర్, శాంతరాజ్, డిఐఓలు నరేంద్ర, శామ్యూల్, చంద్రశేఖర్, చిట్టిబాబు, అంజలీదేవి, మోహన్, మురళీ, చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :