Wednesday, 29 July 2026 05:38:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిజెపి అభ్యర్థి చల్ల శ్రీలత రెడ్డి గడప గడప ప్రచారం...

Date : 15 November 2023 02:19 AM Views : 362

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలో గరిడేపల్లి మండలం లోని పోనుగోడు,మర్రికుంట, గడ్డిపల్లి, కుతుబ్ షా పురం, గ్రామాల్లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలత ఎన్నికల ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రీలత కి స్వాగతం పలికారు.పొనుగోడు లో రామాలయం గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.మహిళల నుండి అపూర్వ స్పందన వచ్చింది. శ్రీలతక్క కి ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలత మాట్లాడారు. - దేశంలో అభివృద్ధి మోడీ వల్లే సాధ్యం అవుతుంది - రాష్ట్రాన్ని కేసిఆర్ కుటుంబం దోచుకున్నది.మిషన్ భగీరథ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేసింది కెసీఆర్ కుటుంబం. - గ్రామాల్లో భగీరథ నీళ్లు రావడం లేదు.గ్రామాల్లో సీసీ రోడ్లు వేయలేదు - గ్రామంలో వీధి ఒక బెల్ట్ షాప్ పెట్టీ ప్రజలను దోచుకోవడం కాకుండా ఆరోగ్యాలను కొల్లగొడుతున్నారు. - ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ లకు అవకాశం ఇచ్చారు.అయిన అభివృద్ధి చేయలేదు. - ఈ సారి ఒక్కసారి బిజెపి కి అవకాశం ఇవ్వండి.దేశంలో మోడీ,రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే అభివృద్ధి దూసుకుపోతుంది. - కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో మీ ఆడబిడ్డ ను గెలిపించండని కోరారు. - ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు,మండల అధ్యక్షులు నర్సింగ్ అంజయ్య, ఒబిసి మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు,మండల ,గ్రామ నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :