సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో కేజీబీవీ స్కూల్ విద్యార్థులకు దరైజ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అధినేత రాజశేఖర్ యాదవ్ తో ఎస్సై గోపి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ ,మోటివేషనల్ స్పీచ్ వివిధ అంశాల పైన శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ క్లాస్ నందు ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత మరియు ఏ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే అంశాలు పరీక్ష ఎలా సిద్ధం కావాలి భవిష్యత్తులో జరగబోయే ప్రదేశాల ప్రవేశ పరీక్షల్లో ఏ విధంగా సన్నద్ధం కావాలి అనే అంశాల పైన విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై గోపి మాట్లాడుతూ భవిష్యత్తులో జరగబోయే అన్ని ప్రవేశాలలో ఇంగ్లీష్ భాషకు ఎక్కువ ప్రాధాన్యత ప్రాధాన్యత ఉండడం చేత విద్యార్థి దశ నుంచే ఇంగ్లీష్ పట్ల ఎక్కువ మక్కువ చూపాలని భయాన్ని విడాలని విద్యార్థులకు తెలియజేశారు.అనంతరం ఎస్ ఓ షబానా మాట్లాడుతూ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు మోటివేషన్ స్పీచ్ మా మా పాఠశాలను ఎంపిక చేసుకొని నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గోపి, కేజీబీవి స్కూల్ ఎస్ఓ షబానా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
-----------------------
Admin