సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో మరో కొత్త కలయిక ఆవిష్కృతం అయింది. వైయస్సార్ తెలంగాణ పార్టీ షాద్ నగర్ అసెంబ్లీ సీనియర్ నేత ఇబ్రహీం కాంగ్రెస్ పార్టీకి తన నైతిక మద్దతు తెలియజేశారు. దీంతో కాంగ్రెస్ - వైయస్సార్ తెలంగాణ పార్టీల మధ్య ఇక్కడ ఎన్నికల దోస్తీ ఏర్పడింది. మొదట కాంగ్రెస్, వైయస్సార్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ పార్టీ అధినేత్రి షర్మిల యూటర్న్ తీసుకున్నారు. దీంతో ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ ఉండదనే అభిప్రాయం నెలకొంది. అయితే తాజాగా గురువారం వీర్లపల్లి శంకర్, వైఎస్ఆర్ నేత ఇబ్రహీంతో మంతనాలు జరిపారు. ఇరువురి మధ్య రాజీ కుదిరింది. దీంతో ఇబ్రహీం తన పార్టీ తరఫున వీర్లపల్లి శంకర్ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి నైతిక మద్దతు ఉంటుందని ప్రకటించారు.
-----------------------
Admin