సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : రిపబ్లిక్ కళాశాల ఎదురుగా ఉన్న బార్ తక్షణమే వేరే చోటికి కూడా మార్చాలని AISA-RSYF నాయకులు మరియు 100 మంది విద్యార్థులు కలిసి కదిరి MRO గారికి స్పందనలో 100 అర్జీలు ఇవ్వడం... ఈ సందర్భంగా RSYF రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్--- జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ఉన్నటువంటి PVR బార్ గతంలో బస్టాండ్ దగ్గరలో ఉండేది. కానీ ఇప్పుడు అది నిబంధనలు విరుద్ధంగా రిపబ్లిక్ కళాశాల ఎదురుగా మరియు శ్రీ సైదాపురం ఆంజనేయస్వామి గుడికి అతి దగ్గరలో ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం గుడికి బడికి కనీసం 500 మీటర్ల దూరం వరకు ఎటువంటి బార్ లేదా వైన్ షాప్ అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ నిబంధన ఉంది. కానీ పివిఆర్ బార్ యాజమాన్యంతోకి కళాశాల ఎదురుగా ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు మరియు గుడికి వచ్చే భక్తులకు అటువైపుగా వెళ్లే డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు మందుబాబులు మద్యం తాగి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు.ఈ సమస్య పై గతంలో కదిరి SEB ఆఫీసర్ గారికి,MRO గారికి, డిప్యూటి తాసిల్దార్ గారికి,RDO గారికి అనేకసార్లు ఈ సమస్యను తెలియజేసిన పరిష్కారం చేయలేదు.అందువలన విద్యార్థులు అందరూ కలిసి చివరి ప్రయత్నంగా స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బార్ యాజమాన్యం పై చర్యలు తీసుకొని బార్ నువ్వు వేరే చోట ఎక్కువ మార్చవలసిందిగా తెలియజేస్తున్నాం లేనియెడల AISA-RSYF విద్యార్థి సంఘాల అధ్వర్యములో భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో AISA కదిరి డివిజన్ కార్యదర్శి ప్రదీప్, RSYF డివిజన్ కార్యదర్శి రాజేష్ మరియు విద్యార్థి సంఘ నాయకులు కిరణ్ దేవ్, శంకర్ , కార్తీక్,బాలాజీ రిపబ్లిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు....
-----------------------
Admin