Wednesday, 29 July 2026 12:16:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ట్రాక్టర్ ట్రాలీ గుంజుకెళ్ళిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి...

Date : 24 January 2023 01:55 AM Views : 479

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం, లబ్దిదారుడి నుంచి ట్రాక్టర్ ట్రాలీ గుంజుకెళ్ళిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి... దళిత బంధులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి... బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్. కొత్తగూడెం: దళిత బంధు పథకం అమలులో జరిగిన లబ్ధిదారుల ఎంపికలో అనేక అవినీతి,అక్రమాలు చోటు చేసుకున్నాయని వాటిపై వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని,అదేవిధంగా ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలంలో లబ్ధిదారుల ట్రాక్టర్ ట్రాలీ బలవంతంగా గుంజుకెళ్ళిన అధికార పార్టీ నాయకులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ క్రిమినల్ కేసు నమోదు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం పార్టీ శ్రేణులతో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన అనంతరం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో దళిత బంధు పథకం ప్రజా ప్రతినిధులకు కమిషన్ ల కోసమే ఉపయోగపడుతుందని, అధికార పార్టీ నాయకులు అమాయక ప్రజల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు..లక్ష్మీదేవిపల్లి మండలంలో జరిగిన ఘటన మాత్రమే వెలుగులోకి వచ్చిందని ఇంకా బయటకు రాని సంఘటనలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు.. ఇప్పటి వరకు అమలు జరిగిన లబ్దిదారులకు సంబంధించిన వివరాలు సేకరించి విచారణ జరిపిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని అన్నారు.. ప్రభుత్వం,ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపించాలని తద్వారా ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న పెద్ద తలల హస్తం కూడా బయటపడుతుందన్నారు..ఈ అవినీతి భాగోతంపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు..అంతేకాకుండా భవిష్యత్తులో ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు... ఈకార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ గంధం మల్లికార్జున్ రావు,అసెంబ్లీ మహిళా కన్వీనర్ కోలా మల్లికా,కేతిని కుమారి,బిమిశెట్టి విజయ,ఏడెల్లి మర్థమ్మ,కొడాలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :