సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజవర్గం లోని అంజలి పురం గ్రామంలో నూతన సి సి రోడ్ల పనుల నిమిత్తం ఎన్ ఆర్ ఈ జీ ఎస్ నిధుల నుండి పదిలక్షల రూపాయలతో హుజూర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సి సి రోడ్ల పనులను ప్రారంభించారు. ఇందుకు గాను గ్రామ ప్రజలు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్ నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ భూక్య నాగు నాయక్ (కాంట్రాక్టర్), వార్డ్ మెంబర్లు గోలి శ్రీను, అల్లి పురం ఉప సర్పంచ్ రాజీవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin