Wednesday, 29 July 2026 03:27:08 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

త్రాగు నీరు అందిస్తున్న అపర భగీరథడు విష్ణువర్ధన్ రెడ్డి...

Date : 25 November 2023 07:21 AM Views : 275

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఎన్నికల్లో మాయగాల్ల మాటలు నమ్మి మోసపోవద్దని బుల్లితెర నటుడు జబర్దస్త్ ఫేం కొమరక్క కోరారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అసెంబ్లీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం లోని హాజిపల్లి, కిషన్ నగర్, బాపన్ గుట్ట తాండ, ముండోన్ రాయి తాండ, పుల్చర్ల కుంట తాండ, పూసల తాండ, బీమారం తాండ, దొంతికుంట తాండ, మరియు తదితర తాండాల్లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా కొమరక్క పాల్గొని ప్రచారం నిర్వహించడం జరిగింది. కొమరక్క మాట్లాడుతూ.. మీ యొక్క గ్రామాల ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు అందించాలని వాటర్ ప్లాంట్ లను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్న అపర భగీరథడు విష్ణన్న అని అన్నారు. ఏ పదవి లేకుండా ఇన్ని పనులు చేస్తుంటే కొందరు ముర్కులు ఓర్వలేక ఎక్కడ విష్ణన్నకు ప్రజల్లో మంచి పేరు వస్తుందో అని ఎన్నో కుట్రలు, కక్ష సాధింపు చర్యలకు దిగి ఎన్ని ఆటంకాలు ఏర్పర్చిన బెదరకుండా ప్రజా క్షేత్రం లో ఉన్న వ్యక్తి విష్ణన్న కాబట్టి ఆదరించి అభిమానించి సింహం గుర్తు పై ఓటు వేసీ అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కేవలం ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చేవారిని ఎందరినో చూసారు ఎన్నికలు అయిపోయాక ఇగ వారి జాడ దొరకదు అని అన్నారు. విష్ణన్న ఎల్లపుడు మీకు అందుబాటులో ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకునే గొప్ప వ్యక్తి కాబట్టి ఆదరించండి అని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్, కిషన్, గణేష్, నరేష్ గంగాదర్, ఇస్నాతి శ్రీనాథ్, హరి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :