సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండలంలోని ఏడు ప్రాథమిక పాఠశాలలను సోమవారం రోజు గోవింద్ పెట్, గోవింద్ హరిజనవాడ జైపూర్ జైపూర్ హజనవాడ మామిడిపల్లి వడ్డెర కాలనీ ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ లో గల రెండు ఉన్నత పాఠశాలలో తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి రాజ్యాగంగారం మాట్లాడుతూ ఈరోజు నుంచి జూలై ఆరవ తేదీ వరకు బడి బాట కార్యక్రమం తిరిగి ప్రారంభించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పించడానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ తమ హెబిటేషన్ లో దర్శించి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలని బడిలో చేర్పించే ప్రయత్నం చేయాల్సిందిగా ఆదేశించడం జరిగిందన్నారు. అలాగే ఈరోజు నుంచి జూలై 31 తారీకు వరకు ఒకటి నుంచి 10వ తరగతి వరకు ప్రతి పాఠశాలలో పాటనోత్సవ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగిందన్నారు. ప్రత్యేక ప్రతి పాఠశాలలో పాటనోత్సవ కార్యక్రమం అమలుకు ప్రత్యేక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని తదను గుణంగా ప్రతి విద్యార్థి చతుర్విధ ప్రక్రియలు వచ్చే విధంగా ప్రణాళిక అబద్ధంగా బోధించాలని ప్రధానోపాధ్యాయులు కర్ణాకర్ మాధవరెడ్డి గంగామణి,అనసూయ, పద్మావతి,విజయసారథి,ప్రసాద్, మధుసూదన్,కవిత ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ఆదేశించడం జరిగిందన్నారు.
-----------------------
Admin