సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలో మహా జన్ సంపర్క్ యోజనలో భాగంగా మండల అధ్యక్షులు దుండిగాల యల్లయ్య అధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా "మేరే బూత్ సబ్సే మజ్బుద్ - ఇంటింటా బిజెపి" కార్యక్రమంలో మండలంలోని జమ్ల తండా, కొత్త తండా గ్రామాలలో విస్తృతంగా పర్యటన జరిపి, ఇంటింటా నరేంద్రమోడీ గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి హుజూర్ నగర్ అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి, విస్తారక్ తాడువాయి నాగరామకృష్ణ ఇరువురు కలిసి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సుమారుగా అందరికీ ఉచిత రేషన్ బియ్యం, స్వచ్ఛ : భారత్ క్రింద మరుగుదొడ్లు లబ్ది, సర్వ శిక్ష అభియాన్ లబ్ధి క్రింద వారి పిల్లలకు ఉచిత పుస్తకాలు, బ్యాగులు, స్కూల్లో పౌష్టికాహారమైన మధ్యాహ్న భోజనము తదితర కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ ద్వారా ప్రధాని చూపిన చొరవ మరియు అద్భుతమైన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. దానికి మోడీ పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో ప్రజలు సంతోషం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ప్రజలే మార్పు రావాలని కోరుకోవడం ఎంతో సంతోషదాయకమైన విషయము. అభివృద్ధికి బిజెపి ఏకైకమైన మార్గమని ఈ సందర్భంగా ప్రజలు విశ్వసిస్తూ వాళ్ల యొక్క అభిలాషను వ్యక్తపరిచారు. ప్రత్యేకించి లబ్ధిదారుల అందరితో కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మంద వెంకటేశ్వర్లు, బానోత్ బాలు నాయక్, రాజు తదితురులు పాల్గొన్నారు.
-----------------------
Admin