Wednesday, 29 July 2026 02:05:34 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లోకేష్ యువగళంపాదయాత్రకుసంఘీభావం వందలాది మంది తెదేపా శ్రేణులతో సంఘీభావ పాదయాత్ర....

Date : 12 July 2023 06:52 AM Views : 433

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు : మండల పరిధిలోని మహ్మదాబాద్ క్రాస్ గ్రామంలో మంగళవారం నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చూసుకొని కొనసాగుతున్న సందర్భంగా తెదేపా నియోజకవర్గం ఇంచార్జ్, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ఓడిచెరువు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వరకు నారా లోకేష్ బాబు పాదయాత్ర కు మద్దతుగా పెద్ద ఎత్తున సంఘీభావంతో పాదయాత్ర చేపట్టారు.ముందుగా ఎంబి క్రాస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీమంత్రి పల్లె మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు జనగళం తోడై మిశ్రమ స్పందన లభిస్తుందని,ఎన్ని కేసులు పెట్టినా అదరకుండా,బెదరకుండా రాత్రింబవళ్ళు పాదయాత్ర చేసి 153 రోజుల్లోనే 50శాతం లక్ష్యానికి చేరుకోవడం లోకేశ్ బాబు పట్టుదల కార్యదీక్షకు నిదర్శనమన్నరు.నారలోకేశ్ యువతను ఉత్తేజపరుస్తూ సామాన్యులకు చైతన్య పరుస్తున్నాడు, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర చేస్తూ 2 వేల కిలోమీటర్లకు చేరుకోవడం అభినందనీయమన్నారు.యువగళం జనగళంతో వైసిపి కొట్టుకోవడం ఖాయమని,లోకేష్ పాదయాత్రతో వైకాపానాయకులగుండెల్లోగుబులుపుట్టిస్తున్నాయని,యువగళం పాదయాత్రకు విశేషమైన జనమే వైసిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని,2024 ఎన్నకల్లో అఖండ విజయంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని,మహానాడులో మాజీ ముఖ్యమంత్రి,జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మ్యాన్ ఫెస్టోని నాయకులు, కార్యకర్తలు ఇప్పటినుండే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలను చైతన్య పరచాలని అయన ఈసందర్బంగా పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో ఆమడగూరు, నల్లమాడ,ఓడిచెరువు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో సంఘీభావ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, సోము కోటి ఆదినారాయణ,మండల కన్వీనర్ జయచంద్ర, బోయపల్లి శివారెడ్డి,నిజాం ,మండోజి ఆరిఫ్ ఖాన్, షబ్బీర్ భాష,ఓబుల్ రెడ్డి, కంచి సురేష్, అంజినప్ప ,పీట్ల సుధాకర్ ,సౌదీ నాగరాజు, అబ్బులు హుస్సేన్ ,వెంకటేష్ నాయుడు , ఇర్షాద్ బడిశం రామాంజి ,పొగాకు షానవాజ్, షామున్ , కొండే ఈశ్వరయ్య, జయచంద్ర రెడ్డి, గంగాద్రి, బడిశం సురేష్, చెండ్రాయుడు, శంకర , రాజారెడ్డి , మస్తానమ్మ, వైదేహి,టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :