సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వి. ఎం. బంజారలో, విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు.... పరీక్షల కారణంగా ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు ప్రధాని మోదీ విద్యార్థులకు గైడెన్స్ ఇస్తూ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది వార్షిక పరీక్షలకు ముందు ‘పరీక్షా పే చర్చ’ పేరుతో విద్యార్థులతో ప్రధాని ఇంటరాక్ట్ అవుతారు. ఈ సారి ఈ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా బుధవారం పెనుబల్లి మండలం వి. ఎం బంజర లోని లక్ష్య టాలెంట్ స్కూల్లో బీజేపీ మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు పాల్గొని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మానసిక వికాసం, ఉత్సాహంతో ఉల్లాసంగా పరీక్షలకు సిద్ధం కావాలని, ఇది భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్ష అని, అంతేకాకుండా ఏ విధమైన మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురికాకుండా ప్రతి విద్యార్థి రాబోయే పరీక్షలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. బీజేపి జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు మాట్లాడుతూ. ప్రధాని మోడీ ప్రతినెలా మాన్ కీ బాత్ కార్యక్రమంలో ఒక్కొక్క విషయాన్ని ప్రస్తావిస్తున్న విషయం అందరికి తెలిసిందే. దానిలో భాగంగా ఈనెల 27వ తేదీన ప్రధాని పరీక్ష పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులు పరీక్షలకు ఏ విధంగా తయారవ్వాలి అనే విషయంపై మాట్లాడనున్నారని, స్వయంగా కొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడతారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పలగాని ఈశ్వర్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin