సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు: మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజా పాలన షెడ్యూల్ ను విడుదల చేసినట్లు ఎంపీడీవో వెంకట చారి తహశీల్దార్ శ్రీదేవి, తెలిపారు.ఈనెల 28 నుంచి జనవరి 6 వ తేది వరకు గ్రామపంచాయతీలోని గ్రామసభల్లో ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.కాగా అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఆయా గ్రామాల్లో తేదీల వారీగా గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.28వ తేదీన దేవుల తండా,యల్లపురం,గుండ్ల పహాడ్, రాఘవపురం,29 వ తేదీన హనుమయ్య గూడెం,సజ్జపురం,అలింగపురం, మీగడంపహాడ్ తండా,30 వ తేదీన బొత్తలపాలెం,మూసీ ఒడ్డు సింగారం,చెరువు తండ,కోమటికుంట,జనవరి 02వ తేదీన గుడుగుంట్ల పాలెం,పాలకవీడు,జాన్ పహాడ్,నాగిరెడ్డి గూడెం, 03 వ తేదీన బెట్టేతండ, శూన్యపహాడ్, జాన్పహాడ్ దర్గా, రావి పహాడ్, 04 వ తేదీన గుండెబోయిన గూడెం,మహంకాళి గూడెం, గ్రామాల్లో ఈ షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.ఈ గ్రామ సభలకు ముందు రోజే దరఖాస్తులు అందించబడతాయని తెలిపారు...
-----------------------
Admin