Friday, 08 May 2026 10:37:12 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలి ...

Date : 01 August 2023 01:12 AM Views : 321

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది ఇట్టి సమావేశంలో జనరల్ ఫండ్ ను ఇష్టారీతిన లక్షల రూపాయలు దొంగ బిల్లులు పెట్టి దోచుకుందామనే విధంగా మున్సిపల్ అధికార వర్గం తయారైందనీ కార్యవర్గ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. దీనికి జిల్లా కలెక్టర్ మరియు జీవన్ రెడ్డి బాధ్యత వహించాలనీ మిగతా సభ్యులు అభిప్రాయం. ప్రజలు పన్నులు కట్టిన దానితో జనరల్ ఫండ్ ప్రజల సౌకర్యార్థం గల్లీలలో డెవలప్ చేయడానికి వాడుకోవాలనీ కానీ ఏదైతే రిపేర్ల పేరు మీద లక్షల రూపాయల ఖర్చుల పేరు మీద దొంగ బిల్లులు పెడుతున్నారని వాపోయారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన కలెక్టర్ గాని సి.డి.ఎం.ఎ గానీ స్పందన కరువైందన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు ... ఏదైతే మొన్న పడ్డ భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ రోడ్లు చెడిపోయినాయి... రోడ్లను బాగు చేయాలని కోరితే కనీసం మొరము వేయమని కోరితే.... C.R తీర్మానం చేసిన తరువాత వేస్తామని చెప్పడం జరిగింది. ఆర్మూర్ రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే పెర్కిట్ నిర్మల్ రోడ్డు శివారులో దాదాపు 33 ఎకరాలు లేఅవుట్ చేసి అక్కడ గల మాటు కాల్వని కబ్జా చేసినందుకే అక్కడ నీరు మొత్తం జలమయింది అని వాపోయారు. మొత్తం అభివృద్ధిలో భాగంగా అంటూ 2018లో వేసిన రోడ్ల తర్వాత కేవలం ఇప్పుడు 2023 ఎలక్షన్ల కోసమే మీరు అభివృద్ధి అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారనీ స్థానిక ఎమ్మెల్యే ను ప్రశ్నిస్తామని అన్నారు. అక్రమ ఇంటి నెంబర్ల మీద అలాగే ఎలైట్ బారు ఇంటి నంబర్ ను క్యాన్సల్ చేసిన చర్యలు లేవని వాపోయారు. ఇప్పటికీ దర్జాగా ఎలైట్ బార్ నడుస్తుంది ఎటువంటి చర్యలు లేవు అలాగే ఆర్మూర్ సిద్దుల గుట్ట వెనకాల ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద కూడా అక్రమ ంగా అక్కడ ఉన్న మాటు కాల్వల్ని కబ్జాకు గురి చేయడం వల్ల మొన్న వచ్చిన వర్షాలలో భారీగా నీరు నిలవడం జరిగింది ఇకనైనా స్పందించాలి అధికారులు. గతంలో ఈ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరు మీద ఉచిత కనెక్షన్ నల్ల నీళ్లు అని చెప్పినారు కానీ ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది కనెక్షన్లకు డబ్బులు కట్టించుకుంటున్నారు. వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడం జరిగింది దీనిపై కమిషనర్ను అడగగా ఆయన సమాధానాన్ని దాటవేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్మూర్ ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే గతంలో వారు ఇచ్చిన మాట ప్రకారం నల్ల నీళ్లు ఉచితం అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు బిల్లులు వసూలు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించినారు. ప్రజలకు అట్లాంటి వాటికీ డబ్బులు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు... అలాగే రిట్ పిటిషన్ నంబర్ 18455 of 2023 ద్వారా హైకోర్టు లో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు వెళ్లడం జరిగింది. ఎందుకంటే CDMA ఇచ్చిన సర్కులర్ ప్రకారం ప్రతి నెల మీటింగ్ ను నిర్వహించాల్సి ఉండగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ మీటింగ్లు నిర్వహించడం లేదని వాపోయారు. అట్లాగే ఆ సర్కులర్లో ఉన్న నిబంధనలను పాటించడం లేదు మండిపడ్డారు. ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్కు సి డి ఎం ఎ హైదరాబాద్కు ఫిర్యాదు చేయగా వారు కూడా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా యొక్క ఇట్టి ఫిర్యాదు పై గౌరవ జడ్జి 15 రోజుల్లో మా ఫిర్యాదు పై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినా. చెత్త బండ్ల రిపేరు మీద అవినీతి జరుగుతుందని వాపోయారు. జనరల్ ఫండ్ మీద జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేశారు. మరియు ఆర్మూర్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకొని యెడల భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది హెచ్చరించారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: