Sunday, 07 June 2026 09:07:42 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత...

Date : 15 February 2023 12:10 AM Views : 705

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం పట్టణంలో మంగళవారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాచలం ఏఎస్‌పి పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు పట్టణ ఎస్ఐ మధుప్రసాద్ తన సిబ్బందితో భద్రాచలం ఫారెస్ట్ చెక్‌‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కర్ణాటక రాష్ట్రం బీదర్‌‌కి చెందిన ఐదుగురు వ్యక్తులు ఏపి 07 ఏడబ్ల్యూ 1383, ఏపి 09 సిహెచ్ 1733 నంబర్లు కలిగిన వోక్స్‌‌వేగాన్ కార్లలో అనుమానాస్పదంగా కనిపించారు. వారి వాహనాలను ఆపి తనిఖీ చేయగా నిషేధిత గంజాయి బయట పడింది. దీంతో వారి వద్ద 132 కిలోల గజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ 26. 40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రం బీదర్‌‌లో అమ్మడానికి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులు సంజీవ్ కుమార్, అజయ్ దేవరాయ్, గణపతి చౌహాన్, సంగేష్ జాదవ్, బాన్సి బిక్కు రాథోడ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈమేరకు కేసు నమోదుచేసి నిందితులను రిమాండ్‌‌కి తరలిస్తున్నట్లు భద్రాచలం సీఐ నాగరాజురెడ్డి తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :