Tuesday, 15 September 2026 11:51:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విజయదశమి' తో "విజయం" సాధించాలి, ప్రజలంతా సుఖ శాంతులతో, జీవించాలి... - ఎమ్మెల్యే సైదిరెడ్డి

Date : 24 October 2023 02:00 AM Views : 402

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : విజయదశమి పండుగ సందర్భంగా.. హుజూర్ నగర్ పట్టణంలోని కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంను సతీ సమేతంగా దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి -రజిత దంపతులు ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాలువతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేసి, అక్షింతలు వేసి ఆశీర్వచనాలు అందజేశారు. ఆ తర్వాత ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ దశమి పండుగ సందర్భంగా.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన ప్రచార రధాలను (ప్రగతి రథచక్రాలను) పరిశీలించి, ప్రారంభించిన శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఈ (ప్రగతి రథచక్రాలు) ప్రచార రధాలు హుజుర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలం, పట్టణం, ప్రతి గ్రామంలో అన్ని ప్రాంతాల్లో పల్లె పల్లెనా,వాడ వాడలా, తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నికల మ్యానిఫెస్టో ను ప్రచారం చేసి, ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని హుజూర్నగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు శ్రీ విజయ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి ఇంటా అష్టైశ్వర్యాలు , సుఖసంతోషాలు ,ఆనందాలు,వెల్లి విరియాలని, ఆ దుర్గమ్మ తల్లి దీవెనలతో నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబానికి సరి కొత్త విజయాలు సిద్ధించాలని, ప్రజలంతా సుఖ శాంతులతో, జీవించాలని అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం ఈ విజయదశమి అని, అలాగే మన హుజుర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా మనం చేసిన మంచి పనులు మనల్ని గెలిపిస్తాయని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి, ఎన్నో మంచి పనులు చేసిన, నిత్యం చిన్నా, పెద్ద అని తేడా లేకుండా, ప్రజల సంక్షేమం కోసం పని చేసిన, నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడ్డాను, మనం చేసిన మంచి పనులే, బి ఆర్ ఎస్ ఎస్ ప్రభుత్వాన్ని, మనల్ని గెలిపిస్తాయని అన్నారు. ఈ నాలుగేళ్ళ లో చెప్పిన ప్రతి పనిని చేసి చూపెట్టినం, మన ప్రాంత ప్రజల కోసం, నిత్యం వారికి సేవ చేయడానికి వచ్చిన. కాబట్టి, అలాగే వారి కోసం నిలబడి,పని చేస్తున్న అని అన్నారు ఈ విజయదశమి సందర్భంగా విజయం సాధించాలని, హుజుర్ నగర్ లో మరోసారి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి, సీఎం కేసీఆర్ కి గిఫ్ట్ గా అందించి, మన బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయం చేకూరాలని విజయ దుర్గ అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: