సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లా ప్రజలకు మెరుగైన సేవల అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఎన్నో యాప్ లను రూపొందించి అమలు పరుస్తున్న అనంతపురం జిల్లా పోలీసు శాఖ ఈరోజు మరో రెండు నూతన యాప్ లను అనంతపురం జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒకటేమో రోడ్డు ప్రమాద బాధితుల సహాయార్థం మరియు రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనదారుల ఆట కట్టించి రోడ్డు ప్రమాదాలు నియంత్రించఢం కోసం రూపొందించిన యాప్ పేరు ANANTHA EAGLE EYE... మరొకటేమో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో జిల్లా ప్రజలు చిక్కుకోకుండా దోహదపడే యాప్ పేరు CYBER KAVACH... ఈ నూతన యాప్ లను అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS రూపొందించి ఈరోజు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తో కలసి బుక్కరాయసముద్రం మండలం SRIT కళాశాలలో సంయుక్తంగా ప్రారంభించారు. ANANTHA EAGLE EYE ఈ అప్లికేషన్ కోసం గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ANANTHA EAGLE EYE అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిష్టర్ కావాలి. ర్యాష్ డ్రైవింగ్ , నిషేధిత ప్రాంతంలో వాహనాలు పార్క్ చేసి ఉండటం, మైనర్లు వాహనాలు నడపటం, తదితర రోడ్డు భద్రత ఉల్లంఘనల సందర్భంగా వాటికి సంబంధించిన ఫోటోలు/వీడియోలు తీసి రిపోర్ట్ యాన్ వైలేషన్ ఆప్షన్ ద్వారా పంపవచ్చు. దీనివల్ల ఉల్లంఘనలపై తక్షణమే చర్యలు తీసుకోనున్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రులకు సంబంధించిన ఘటనా స్థలంలోని ఫోటోలు/వీడియోలు పంపవచ్చు. ఈ సమాచారం పోలీసులకు వెంటనే చేరడం వల్ల క్షతగాత్రులకు గోల్డెన్ హవర్ లో అందాల్సిన చికిత్స వెంటనే చేయించి ప్రాణాలు కాపాడే వీలుంటుంది. వాస్తవంగా ఘటనలకు సంబంధించిన దృశ్యాలు/ సమాచారం పంపిన వారికి రివార్డు పాయింట్లు కూడా ఉంటాయి. అధిక పాయింట్లు పొందిన వారిని గుర్తించి గుడ్ సమరిటన్ అవార్డు కూడా ప్రదానం చేయనున్నారు. ఈ అప్లికేషన్ ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం... క్షతగాత్రులను సురక్షితం చేయడమే... ANANTHA EAGLE EYE యాప్ డౌన్లోడ్ కోసం ఈ లింకు ఉపయోగించగలరు... https://play.google.com/store/apps/details?id=com.anantapur.eagleeye
-----------------------
Admin