Monday, 14 September 2026 05:39:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి... - సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ

Date : 04 February 2024 12:20 PM Views : 367

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట రూరల్ : సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపి ఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట రూరల్ పరిది పి జి టి నర్సింగ్ కళాశలలో విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశలోనే విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్ పై ఏర్పాటు చేసిన ఈ సదస్సు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సైబర్ నేరాలకు గురి కాకుండా ముందుగానే గుర్తించాలని, మొబైల్ ఫోన్కు - ఈమెయిల్ కు వచ్చే మెసేజ్ ల పట్ల, ఏదయినా సోషల్ మీడియాకు సమాచారానికైనా స్పందించకుండా అప్రమంతంగా ఉండాలన్నారు. మొబైల్ ఫోన్లకు క్రెడిట్ కార్డ్ ల పరిమితి పెంచుతామని వచ్చే సందేశాలకు ఎవరు నమ్మి స్పందించవద్దన్నారు. వివిధ కంపెనీల నుంచి క్రెడిట్ కార్డ్ పొందేందుకు అర్హత సాధించినట్లు వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను స్వైపింగ్ చేసే సమయంలో పిన్ నెంబర్ను ఎవరికి తెలపకూడదని స్వయంగా వారే నమోదు చేసుకోవాలన్నారు. తమ క్రెడిట్/డెబిట్ కార్డులను అపరిచిత వ్యక్తులకు,సొంత వారికి సైతం ఇవ్వకూడదన్నారు. కొన్ని రకాల టార్గెట్ టాస్కులతో ఫోన్లకు చేస్తూ సైబర్ నేరగాళ్లు మెసేజ్ లను చేస్తున్నారు. నాకు అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయకూడదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫాలో అవుతూ వాటి స్క్రీన్ షాట్లను పంపి నగదు అందజేస్తామని వచ్చే పోస్టులు అవాస్తవ సందేశాలను నమ్మకూడదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ సమయంలో క్యూఆర్ కోడ్లను సరైనదిగా ఉన్నాయో లేవో సరిచేసుకుని నగదు లావాదేవీలు చేసుకోవాలన్నారు. ఏదైనా సందేహాలు ఉంటే కస్టమర్ కేర్ కు సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. వివిధ విభాగాలుగా సైబర్ మోసగాళ్ళు ప్రజలపై గురిపెట్టె అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆన్లైన్లో జరిగే లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండి,సైబర్ నెరగాలకు మోసాలకు బలి కావద్దన్నారు. సైబర్ ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా సైబర్ క్రైమ్ govt ఇన్ ని సంప్రదించాలని, పోలీస్ సహాయం కోసం డయల్ 100 కు సమాచారం అందజేయాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం అధిక ప్రాచుర్యంలో ఉన్న కొరియర్ సర్వీసుల పట్ల జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఆన్లైన్లో బుక్ చేసిన వస్తువులు ఉన్నాయో లేదో చూసిన అనంతరమే నగదును కొరియర్ సర్వీస్ ఏజెంట్లకు ఇవ్వాలని, లేని పక్షంలో మోసపోయే అవకాశాలు ఎక్కువ శాతం నమోదు అవుతున్నాయని తెలిపారు.ఆన్లైన్ వ్యాపారం చేసే సమయాల్లో నగదును పెట్టుబడిగా చేస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తో పాటు కస్టమర్ కేర్ నుంచి తమకు ఫోన్ చేస్తున్నామని వివరాలు అడుగుతే ఇవ్వకూడదని ఇన్స్పెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ ఐ బాలు నాయక్, కళాశాల ఉపద్యాయులు , విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: